Header Banner

పార్టీకి స్పష్టమైన మార్గదర్శనం.. కీలక ఆదేశాలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్! జిల్లాల్లో పర్యటనలు తప్పనిసరి!

  Fri Mar 14, 2025 15:37        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పాలనలో జరుగుతున్న మార్పులను వివరించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాల్లో ఇన్‍ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించి అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలకు వెళ్లే ముందు ఆయా జిల్లా కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. పార్టీ గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని, ప్రతి ఇన్‍ఛార్జ్ మంత్రి తన జిల్లాలో పూర్తిగా ఫోకస్ పెట్టాలని, పర్యటనల సంఖ్యను పెంచాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాలకు తప్పకుండా వెళ్లాలని, వైసీపీ నేతలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. వైసీపీకి ఓటేసిన వారికి సంక్షేమ పథకాలు అందజేయకుండా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని, అందులో వివక్ష ఉండదని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతుందని, కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని, త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు అందించాలని సూచించారు. పదవులు రాలేదని నిరాశ చెందవద్దని, పార్టీలో పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించామో ఇప్పుడు కూడా అదే హుందాతనాన్ని పాటించాలని సూచించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు, పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ చూపాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #apcm #cbn #teleconference #todaynews #flashnews #latestnews